Kalki : OTTలోకి ‘కల్కి’ ట్రిమ్ వెర్షన్.. ఏ సీన్స్ కట్ చేశారంటే?

ManaEnadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే 50 డేస్ పూర్తి చేసుకుని గ్రాండ్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. దాదాపు రూ.1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఎట్టకేలకో ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్​లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో.. నెట్​ఫ్లిక్స్​లో హిందీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా అన్ని వెర్షన్ల ట్రిమ్ చేశారట. మరి ఎంత సేపు ట్రిమ్ చేశారు? ఏయే సీన్స్ కట్ చేశారో తెలుసుకుందామా?

కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలైనప్పుడు 181 నిమిషాలు, అంటే 3 గంటల ఒక నిమిషం ఉంది. సినిమాకు టాక్ పాజిటివ్​గా ఉన్నా.. రన్​టైం ఎక్కువైందనే టాక్ వినిపించింది. అయితే కథకు తగ్గట్టు నిడివి ఉందని, ఏ సీన్ కట్ చేయలేమని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అప్పుడు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఓటీటీలోకి వచ్చిన వెర్షన్​లో మాత్రం ఏకంగా 6 నిమిషాలను ట్రిమ్ చేశారు. ప్రస్తుతం కల్కి రన్ టైమ్​ 175 నిమిషాలు (2 గంటల 55) నిమిషాలతో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఏ సీన్లు తగ్గించారంటే?

సీన్ 1- ఇంట్రడక్షన్ సీన్​లో ప్రభాస్​ను కప్ప అని పిలిచే సీన్​ ఉంటుంది. దాన్ని తీసేశారట.

సీన్ 2-  ఎంట్రీలో ఇద్దరు భారీ ఆకారం ఉన్న వ్యక్తులతో ప్రభాస్​ ఫైట్​ చేస్తారు. ఆ సన్నివేశం కాస్త లాంగ్​గా ఉంటుంది దాన్ని ట్రిమ్ చేశారు.

సీన్ 3- కాంప్లెక్స్​లోకి వెళ్లిన తర్వాత దిశా పటానీతో ప్రభాస్ టక్కర సాంగ్​లో బీచ్ సీన్లు తీసేశారు.

సీన్ 4- ఇంటర్వెల్​​లో దీపికా పదుకొణె మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సన్నివేశానికి థీమ్​ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్​ను యాడ్ చేసి, ఇంటర్వెల్ కార్డును పూర్తిగా కట్ చేశారు.

 

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *