ManaEnadu:కోలీవుడ్ నిర్మాత కళానిధి మారన్.. సినిమాల ఎంపికలో, నాణ్యమైన చిత్రాలు అందించడంలో ఈయన స్టైలే వేరు. ఇక తన సినిమాలు విజయం సాధించే ఆయన ఆనందానికి అవధులే ఉండవు. కేవలం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు తన సినిమా సక్సెస్ అయినప్పుడు అందులో నటించిన నటీనటులు, ఆ చిత్రం కోసం పనిచేసిన టెక్నీషియన్లకు భారీగా బహుమతులు ఇస్తుంటారు. ఇప్పటికే జైలర్ సినిమా సక్సెస్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ నెల్సన్, హీరో రజనీకాంత్‌కు ఖరీదైన కారు, ఆ చిత్రం కోసం పనిచేసిన వారందరికి గోల్డ్ కాయిన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఇక తాజాగా ఆయన నిర్మాణంలో ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘రాయన్’. జులై ఆఖరి వారంలో థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌ను నిర్మాత కళానిధి మారన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు. తాజాగా ఈ సినిమా దర్శకుడు, నటుడు అయిన ధనుశ్‌ను కలిసి ఆయన్ను సర్‌ప్రైజ్ చేశారు.
ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ధనుశ్‌ను అభినందించారు. అనంతరం కానుకగా రెండు చెక్కులు ఇచ్చారు. రెండు చెక్కులు ఎందుకంటే ఈ సినిమాకు దర్శకుడు, హీరో ధనుశ్ కాబట్టి. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కళానిధి మారన్ తన ఆనవాయితీ పాటించడం ఎప్పుడు మరిచిపోడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ఆ చెక్కులో ఎంత ఎమౌంట్ రాశారోనని కామెంట్లు పెడుతున్నారు.
ధనుశ్ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ‘రాయన్’ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి కీలక పాత్రలు పోషించారు. రెండు గ్యాంగ్‌ల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటం వల్ల హీరో కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? తమ్ముళ్లు చెల్లెళ్లను హీరో ఎలా కాపాడుకోగలిగాడు? అనే కథతో ఈ సినిమా తెరకెక్కించాడు ధనుశ్. ఈ మూవీ రూ. 150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా.. ‘లైబ్రరీ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ మోషన్ ఆర్ట్స్ అండ్ సైన్స్’లో చోటు దక్కించుకుంది. ఇక రేపటి నుంచి (ఆగస్టు 23వ తేదీ) ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…