ManaEnadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే 50 డేస్ పూర్తి చేసుకుని గ్రాండ్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. దాదాపు రూ.1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఎట్టకేలకో ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో.. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా అన్ని వెర్షన్ల ట్రిమ్ చేశారట. మరి ఎంత సేపు ట్రిమ్ చేశారు? ఏయే సీన్స్ కట్ చేశారో తెలుసుకుందామా?
కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలైనప్పుడు 181 నిమిషాలు, అంటే 3 గంటల ఒక నిమిషం ఉంది. సినిమాకు టాక్ పాజిటివ్‌గా ఉన్నా.. రన్‌టైం ఎక్కువైందనే టాక్ వినిపించింది. అయితే కథకు తగ్గట్టు నిడివి ఉందని, ఏ సీన్ కట్ చేయలేమని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అప్పుడు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఓటీటీలోకి వచ్చిన వెర్షన్లో మాత్రం ఏకంగా 6 నిమిషాలను ట్రిమ్ చేశారు. ప్రస్తుతం కల్కి రన్ టైమ్ 175 నిమిషాలు (2 గంటల 55) నిమిషాలతో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఏ సీన్లు తగ్గించారంటే?
సీన్ 1- ఇంట్రడక్షన్ సీన్లో ప్రభాస్‌ను కప్ప అని పిలిచే సీన్ ఉంటుంది. దాన్ని తీసేశారట.
సీన్ 2- ఎంట్రీలో ఇద్దరు భారీ ఆకారం ఉన్న వ్యక్తులతో ప్రభాస్ ఫైట్ చేస్తారు. ఆ సన్నివేశం కాస్త లాంగ్గా ఉంటుంది దాన్ని ట్రిమ్ చేశారు.
సీన్ 3- కాంప్లెక్స్‌లోకి వెళ్లిన తర్వాత దిశా పటానీతో ప్రభాస్ టక్కర సాంగ్‌లో బీచ్ సీన్లు తీసేశారు.
సీన్ 4- ఇంటర్వెల్లో దీపికా పదుకొణె మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సన్నివేశానికి థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్‌ను యాడ్ చేసి, ఇంటర్వెల్ కార్డును పూర్తిగా కట్ చేశారు.