ముసలాడే కానీ మహానుభావుడు.. ‘ఇంద్ర’ రీరిలీజ్​లో పెద్దాయన డ్యాన్స్ అదుర్స్

ManaEnadu:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ (ఆగస్టు 22వ తేదీ). ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మెగాస్టార్ మేనియా మామూలుగా లేదు. ఉదయం నుంచి బర్త్ డే విషెస్​తో నెట్టింట రచ్చ జరుగుతోంది. ఇక చిరు బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ అయింది.

బీ గోపాల్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామాలో చిరంజీవి ఇంద్రసేనా రెడ్డిగా అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై నేటితో 22 ఏళ్లు పూర్తవుతోంది. మరోవైపు ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు. ఈ రెండు సందర్భాలు పునస్కరించుకుని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఇంద్ర మూవీని రీరిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా చూస్తూ అభిమానులు సందడి చేశారు.

భారీ కటౌట్లు, పాలాభిషేకాలు.. సందడి మామూలుగా లేదు. మెగా అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ మూవీలో.. నేనున్నాను నాయనమ్మ.. అంటూ చిరంజీవి చిన్ననాటి పాత్రలో అలరించిన నటుడు, హనుమాన్ ఫేం తేజ సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి ఈ సినిమా చూశాడు.

ఇక మరో థియేటర్​లో ఓ మెగా ఫ్యాన్ చిరంజీవి తెరపై డ్యాన్స్ చేయగానే.. తాను థియేటర్​లో కుర్చీలో నుంచి స్టెప్పులేశారు. తోటి ప్రేక్షకులతో కలిసి ఓ పెద్దాయన ‘అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో’ పాటకు స్టెప్పులేయగా… అక్కడ ఆ పెద్దాయన పక్కనే కూర్చున్న ఓ అబ్బాయి ఈ వీడియో రికార్డు చేశాడు. దాన్ని ఎక్స్‌లో షేర్‌ చేశాడు.

“ఈ పెద్దాయనతో కలిసి నేను ఇంద్ర సినిమా చూశాను. ఆయనకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. అది ఆయన కళ్లల్లో కనిపిస్తోంది. చిరంజీవి స్టెప్పులకు మ్యాచ్ అయ్యేలా ఆయన పాటకు డ్యాన్స్ చేశాను. ఈయనకు.. ముసలాడే కానీ మహానుడు భావుడు అనే ట్యాగ్​లైన్ ఇచ్చేద్దాం ప్లీజ్. అది అతని సొత్తు. బాస్​ ను మ్యాచ్ చేశారయ్యా మీరు. బాసూ.. మీ డైహార్డ్ ఫ్యాన్ అంట” అని ఓ క్యూట్ క్యాప్షన్ యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆయన ఎనర్జీని మెచ్చుకుంటున్నారు.

https://twitter.com/hashtag/Indra4K?src=hash&ref_src=twsrc%5Etfw%22%3E#Indra4K%3C/a%3E

Share post:

లేటెస్ట్