బిగ్​బాస్ -8 కంటెస్టెంట్స్ కొత్త లిస్టు వైరల్.. హౌజ్​లోకి వెళ్లేది వీళ్లేనట!

ManaEnadu:తెలుగులో బిగ్గెస్ రియాల్టీ షో మరో పది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ రిలీజ్ డేట్​ను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో హౌజ్​లోకి ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు మూడు రకాల కంటెస్టెంట్ల లిస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా వీళ్లే బిగ్​బాస్ హౌజ్​లోకి వెళ్లే సెలబ్రిటీలు అంటూ మరో 12 మందితో కూడిన ఓ లిస్టు నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ కొత్త లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

సీజన్ 8లో బిగ్ బాస్ హౌజ్​లో అడుగుపెట్టే సెలెబ్రిటీల్లో 12 మంది ఉన్నారంటూ నెట్టింట ఓ లిస్టు వైరల్ అవుతోంది. ఆ లిస్టులో సింగర్ సాకేత్, యూట్యూబర్, విరూపాక్ష ఫేం సోనియా సింగ్, అలీ తమ్ముడు ఖయ్యూమ్, రీతూ చౌదరి, యాంకర్​ విష్ణు ప్రియ, సీరియల్ నటుడు నిఖిల్, యాంకర్ సౌమ్యరావు, సీరియల్ నటి అంజలి పవన్, యాక్టర్ అభిరామ్ వర్మ, సీరియల్​ నటి యష్మీ గౌడ, మోడల్ ఊర్మిళ చౌహాన్, యూట్యూబర్​ బెజవాడ బేబక్క కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.వీళ్లతో పాటు మరికొంత మంది కూడా రాబోతున్నట్లు సమాచారం.

అయితే సీజన్ మొదట్లో ఎప్పుడూ 12 మంది కంటెస్టెంట్లు హౌజ్​లోకి వెళ్తారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రీ ఎంట్రీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ గ్రాండ్ లాంచింగ్​కు స్టార్ హీరోలు గెస్టులు​గా రానున్నట్లు సమాచారం. ఎప్పటిలాగే పలువురు హీరోయిన్స్, కంటెస్టెంట్స్ అదిరిపోయే పెర్ఫామెన్స్​లతో ఆకట్టుకోనున్నారు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదంటూ నయా కాన్సెప్టుతో.. సరికొత్త గేమ్ ప్లాన్​తో మరికొన్ని రోజుల్లో మన ముందుకు రాబోతోంది.

Related Posts

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Kubera: కుబేరలోని పిప్పీ పిప్పీ డమ్ డమ్ డమ్’ ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్..

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’(Kubera) ఈ నెల 20న విడుదలై సూపర్ హిట్​ టాక్​ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. తాజాగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *