Hydra:హడలెత్తిస్తున్న హైడ్రా.. పక్కా ప్లాన్​తో అక్రమ కట్టడాలపై ముప్పేట దాడి

ManaEnadu:హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రాకు కమిషనర్​గా ఐపీఎస్ అధికారి రంగనాథ్​ను నియమించింది. ఈ క్రమంలో రంగనాథ్ టీమ్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నారు. హైడ్రా కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్‌ మొదట నగరంలోని చెరువుల ఆక్రమణపై అవగాహన కోసం రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ద్వారా ఉపగ్రహ చిత్రాలను తెప్పించారు. ఆక్రమణల తీరును నిపుణులతో అంచనా వేయించారు. అక్రమ కట్టడాల జాబితాను సిద్ధం చేసి మొదటి వారం నుంచే కూల్చివేతలు షురూ చేశారు. ఇలా నగరంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన ఆయన బృందం.. పక్కా ప్లాన్​తో మూడో కంటికి తెలియకుండా రంగంలోకి దిగుతోంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా ముప్పేట దాడి చేస్తోంది.

గతంలో బల్దియా, హెచ్‌ఎండీఏ అధికారులు పాక్షికంగా కూల్చడం, స్లాబులకు రంధ్రాలు చేయడం వంటివి చేసి అక్కడితో మమ అనిపించే వారు. కానీ హైడ్రా మాత్రం మొత్తం భవనాలను పునాదుల నుంచి నేలమట్టం చేస్తోంది. కూల్చివేతల సమాచారాన్ని ఏమాత్రం బయటకు రానివ్వకుండా పక్కా ప్రణాళికలతో దూసుకెళ్తోంది. ఇక అందరూ సేదతీరే వీకెండ్ (శని, ఆదివారాలు)ను తన పని కానిచ్చేందుకు వినియోగించుకుంటోంది.

రంగనాథ్ అండ్ టీమ్ ప్లానింగ్ ఎలా ఉందంటే?

ముందుగా రంగనాథ్ అండ్ టీమ్.. అక్రమ నిర్మాణాలను గుర్తిస్తుంది. ఆ తర్వాత సిబ్బంది మఫ్టీలో వెళ్లి అక్కడి భవనాలు, కట్టడాలను పరిశీలిస్తారు. వాటిని కూల్చేందుకు ఎంత సమయం పడుతుంది? ఏయే వాహనాలు అవసరం? వంటి అంశాలను అంచనా వేస్తారు. ఆ తర్వాత ఆ విషయాన్ని తమ బాస్ రంగనాథ్​తో చర్చిస్తారు. ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం.. ముందురోజు రాత్రి సిబ్బంది, యంత్రాలను రెడీ చేసుకుంటారు. ఇక తెల్లవారగానే రంగంలోకి దిగి వంతుల వారీగా సిబ్బంది బ్రేక్ లేకుండా కట్టడాలను కూల్చేస్తున్నారు. అయితే ఈ విషయం లీక్ కాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ జాగ్రత్తపడుతున్నారు. ఇన్ఫర్మేషన్ లీకైతే సస్పెండ్ చేస్తానని సిబ్బందిని, అధికారులను హెచ్చరించడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. హైడ్రా ఏర్పాటైన రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *