Mana Enadu: మట్టిలో పుట్టిన గ్రామీణ ఆట కబడ్డీకి ఎనలేని గుర్తింపు తెచ్చిన ప్రో కబడ్డీ లీగ్(PKL 11 Season ) మరో సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈమధ్యే వేలం ముగియడంతో నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. పీకేఎల్ 11 వ సీజన్ అక్టోబర్ 18వ తేదీన మొదలవ్వనుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం(Gachibowli Indoor Stadium)లో కబడ్డీ(Pro Kabaddi) పండుగ ఆరంభం కానుంది. గత పది సీజన్లుగా అభిమానుల(Fans)ను ఆకట్టుకుంటున్న ఈ టోర్నీని ఈసారి మూడు నగరాల్లో నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 12 జట్లు PKLలో తలపడనున్నాయి. కాగా ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేతగా పుణేరి పల్టన్ జట్టు నిలిచింది. ఫైనల్ పోరులో హరియాణా స్టీలర్స్‌ను 28-25తో ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉంటుంది. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో కూడా చూడొచ్చు.
వేలంలో అత్యధిక పలికిన ప్లేయర్లు
కాగా ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా సచిన్ తన్వార్(Sachin Tanvar) నిలిచాడు. సచిన్‌ను రూ.2.15 కోట్లకు తమిళ తలైవాస్ దక్కించుకుంది. సచిన్ తర్వాత మహ్మద్ రెజా అత్యధిక ధర పలికాడు. రూ. 2.07 కోట్లకు హరియాణా స్టీలర్స్ సొంతం చేసుకుంది. ఈ వేలంలో గమన్ సింగ్ రూ. 1.97కోట్లుకు సేల్ అయ్యాడు. మరో స్టార్ ప్లేయర్ పవన్ సెహ్రావత్‌ను మరోసారి తెలుగు టైటాన్స్ వేలంలో కొనుగోలు చేసింది. రూ.1.70 కోట్లకు దక్కించుకుంది. ఇక భరత్, మణిందర్ సింగ్, అజింక్యా పవార్, సునీల్ కుమార్ వంటి ప్లేయర్లు ఈసారి వేలంలో రూ. కోటికిపైనే దక్కించుకున్నారు. అయితే సీనియర్ ప్లేయర్లు రాహుల్ చౌదరి, రోహిత్ గులియా, విశాల్ భరద్వాజ్‌ను ఈసారి ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు.
వేదికలు ఇవే..
☛ హైదరాబాద్(Hyderabad) – గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 18 నుంచి
☛ నోయిడా(Noida) – నవంబర్ 10 నుంచి నోయిడా ఇండోర్ స్టేడియంలో
☛ పుణే(Pune) – డిసెంబర్ 3 నుంచి బాలేవాడి బ్యాడ్మింటన్ స్టేడియం
☛ ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలు తర్వాత ఖరారు చేస్తారు.
టోర్నీలో పాల్గొనే జట్లు
☛ హరియాణా స్టీలర్స్
☛ పుణేరి పల్టన్
☛ జైపూర్ పింక్ పాంథర్స్
☛ యు ముంబా
☛ తెలుగు టైటాన్స్
☛ తమిళ్ తలైవాస్
☛ పాట్నా పైరేట్స్
☛ బెంగళూరు బుల్స్
☛ యూపీ యోధాస్
☛ దబాంగ్ ఢిల్లీ కెసి
☛ బెంగాల్ వారియర్స్
☛ గుజరాత్ జెయింట్స్