ManaEnadu:ఈ కాలంలో చేతిలో సెల్‌ఫోన్ అదీ స్మార్ట్ ఫోన్ (Smart Phones) లేకపోతే ఎవరకీ క్షణం పాలుపోవడం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరికీ స్మార్ట్ ఫోనే కావాలి. ఇక అందులో మోడల్సూ, కలర్సూ, ఫీచర్సూ అని కొందరు, ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు ఫోన్ వాడొద్దంటూ ఇంకొందరు.. మార్కెట్‌లోకి కొత్త ఫోన్ వచ్చిందో లేదో మరికొందరు.. ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన మొబైల్స్‌ను కొనాలని ఉవ్విళ్లూరుతుంటారు.
కొందరు మాత్రం కేవలం కాల్స్, చాట్ పర్పెస్‌లోనే మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. తక్కువ ధర అయినా ఫర్వాలేదని తమ స్తోమతకు తగ్గ ఫోన్లు కొంటున్నారు. అలాంటి వారి కోసమే ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ ఆకర్షణీయమైన డిజైన్‌తో కొత్త మొబైల్‌ను దేశీయ మార్కెట్‌ల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ06 (Samsung Galaxy A06) పేరిట దీన్ని లాంచ్ చేసింది. 50ఎంపీ ఈ మొబైల్ ఫీచర్ల గురించి ఓసారి తెలుసుకుందామా?
రెండు వేరియంట్లలో లభిస్తున్న శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.11,499గా. బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇవే..
6.7 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌ఈడీ స్క్రీన్
ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ6
మైక్రో ఎస్‌డీ కార్డ్ సాయంతో 1టీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు
వెనకవైపు 50ఎంపీ రియల్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సర్
సెల్ఫీ కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా
4జీ, వైఫై, బ్లూటూత్ 5.3, 3.5mm ఆడియోజాక్,
యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్
5,000mAh బ్యాటరీ
25W వైర్డ్ ఫాస్ట్








