Holidays: తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యస్.. ఆ రెండ్రోజులు హాలిడే

Mana Enadu: ఉద్యోగులు, విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Goverment) శుభవార్త చెప్పింది. ఈ నెలలో జరుపుకోనున్న మిలాద్ ఉన్ నబీ, వినాయక చవితి(Ganesh Chaturthi) పండుగల నేపథ్యంలో సీఎం రేవంత్(CM Revanth) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. SEPTEMBER 7న వినాయక చవితి, 17న మిలాద్ ఉన్ నబీ ఉన్న నేపథ్యంలో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించే సాధారణ సెలవుల క్యాలెండర్(Holiday Calandar) ప్రకారం సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ సెలవు ఉంది. కానీ ఈ తేదీని మారుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హాలిడే సెప్టెంబర్ 17వ తేదీకి మారింది.

 వేడుకగా గణేశ్ ఉత్సవాలు

మిలాద్ ఉన్ నబీ(Milad-un-nabi)హాలిడే విషయంలో నెలవంక దర్శనం కీలకంగా ఉంటుంది. గతేడాది కూడా ఓ తేదీని నిర్ణయించినప్పటికీ… మరో తేదీలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 7వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు(Ganesh Celebrations) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పండగకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా యువత ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద యెత్తున మండపాల నిర్మాణాలు చేపడుతున్నారు. అటు గణనాథుల కొనుగోలు ప్రక్రియ కూడా జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈనెల 17న గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఉంది. ఇదే రోజు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కూడా జరగాల్సి ఉంటుంది. కానీ ఇటీవలే ఇదే విషయంపై CM రేవంత్ రెడ్డి మిలాద్ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సచివాలయంలో నిర్వహించిన స‌మీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సీఎం రేవంత్ సూచనలతో

ప్రభుత్వం జరిపిన చర్చల్లో మిలాద్-ఉన్-న‌బీ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 19న నిర్వ‌హించేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు ఓకే చెప్పారు. సెప్టెంబ‌రు 7 నుంచి గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు, 17న నిమ‌జ్జ‌నం ఉన్న విష‌యం చ‌ర్చ‌కు వచ్చింది. ఈ సందర్భంలోనే మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకోవాలని CM రేవంత్ రెడ్డి కోరారు. ఇదే అంశంపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ, మిలాద్ క‌మిటీ స‌భ్యులు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై చర్చించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని మిలాద్-ఉన్-న‌బీ ర్యాలీ వేడుకలను 19వ తేదీన నిర్ణయించేందుకు అంగీకరించింది.

 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *