HAPPY TEACHERS DAY 2024 : తెలంగాణలో ఉత్తమ టీచర్లుగా 103 మంది.. నేడే అవార్డుల ప్రదానం

ManaEnadu:“గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర; గురు సాక్షాత్ పరః బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః”. గురువే ఆ బ్రహ్మదేవుడు, గురువే ఆ విష్ణుమూర్త, గురువే మనలోని అజ్ఞానాన్ని పారద్రోలే ఆ మహేశ్వరుడు. అటువంటి గురువుకు శిరస్సువంచి పాదాభివందనాలు. ఇవాళ (సెప్టెంబరు 5వతేదీ 2024) ఉపాధ్యాయ దినోత్సవం (Teacher’s Day 2024), గురుపూజోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనకు విద్యతో పాటు జీవన ప్రయాణంలో ఎలా నడుచుకోవాలో దారి చూపిన ఉపాధ్యాయులందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం.

103 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

ఇక గురుపూజోత్సవం సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల నుంచి 103 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు… ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసింది. పాఠశాల విద్యాశాఖ నుంచి 47 మంది, 11 మందిని ఇంటర్‌ విద్యాశాఖ నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి 45 మంది ఉత్తమ టీచర్లుగా ఎంపికయ్యారు.

మొదట పాఠశాలల నుంచి 41 మందిని ప్రకటించిన సర్కార్… కొందరు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడటం లేదని భావించి, వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించి ఫోర్‌ రన్నర్స్‌ విభాగం పేరిట మరో ఆరుగురిని ఎంపిక చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు.

నేడే పురస్కారాలు ప్రదానం..

పాఠశాల విద్యాశాఖలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల విభాగంలో 10 మంది ఎంపికవ్వగా.. 20 మంది స్కూల్‌ అసిస్టెంట్‌/ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు/ఫిజికల్‌ డైరెక్టర్లు/పీజీటీ విభాగాల నుంచి.. 11 మంది ఎస్‌జీటీ/పీఈటీ/భాషా పండితుల విభాగాల నుంచి ఎంపికయ్యారు. విశ్వవిద్యాలయాల నుంచి 26 మంది శాశ్వత ఆచార్యులు, మరో 29 మంది అనుబంధ కళాశాలల అధ్యాపకుల(Lecturers)ను ఈ పురస్కారం వరించింది. ఉత్తమ ఉపాధ్యాయులు (Best Teachers)గా ఎంపికైన వారికి ఇవాళ (గురువారం) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించే గురుపూజోత్సవం సందర్భంగా పురస్కారాలను ప్రభుత్వం అందజేయనుంది. అవార్డుతో పాటు వారికి రూ.10 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేసి శాలువాతో సత్కరించనుంది.

Related Posts

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *