Cancer Vaccine: క్యాన్సర్​ టీకా.. కనుగొన్నట్లు వెల్లడించిన రష్యా

క్యాన్సర్​ మహమ్మారితో అల్లాడిపోతున్నవారికి రష్యా (Russia) గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్​ నివారణకు వ్యాక్సిన్ (Cancer Vaccine) కనుగొన్నట్టు వెల్లడించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముందుగా జనవరి 2025 నుంచి ఆ దేశంలో ఉన్న బాధిత పౌరులకు ఉచితంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ టీకా గురించి వెల్లడించినట్లు రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS తెలిపింది.

ఇప్పటివరకు సరైన వైద్యం లేక క్యాన్సర్ (Cancer )​ కోరలు చాస్తోంది. అయితే ఈ వ్యాధి పనిపట్టేందుకు శాస్త్రీయంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి సాధ్యమేనని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్​ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో రష్యన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్‌తో సహా రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ వ్యాక్సిన్ ఏ క్యాన్సర్‌కు పనిచేస్తుంది? ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? వ్యాక్సిన్‌ను ఏమని పిలుస్తారోని స్పష్టంగా చెప్పలేదు. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Sonia Gandhi: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ఏమైందంటే!

కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *