ప్రకృతి మరో దేశంపై తన ప్రకోపం చూపించింది.ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను వణించిన భారీ భూకంపాలు.. వేల మందిని బలితీసుకున్నాయి. తాజాగా న్యూజిలాండ్(New Zealand)లోనూ భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.10 గంటల సమయంలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. పశ్చిమ తీరంలో రిక్టర్ స్కేలు(Richter scale)పై 6.2 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
#NewZealand🇳🇿: A strong #earthquake of magnitude Mww=6.2, was registered at 286 KM SW of #Bluff, region of #Southland. Depth: 10 KM.
More info: https://t.co/CL3pJK0Jz2 (and ALT).
Did you feel this earthquake?, Tell us!.#EQVT,#rū,#quake,#tremor,#seísmo,#sismo,#temblor,#terremoto. pic.twitter.com/3opD9cyypH— American Earthquakes 🌋🌊🌎 (@earthquakevt) April 29, 2025
300 కిలోమీటర్ల దూరంలో..
అయితే ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు(Tsunami warnings) ఏమి జారీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే(US Geological Survey) తెలిపింది. కాగా న్యూజిలాండ్‌లోని ఇన్వర్‌కార్గిల్‌కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉంది. ప్రాథమికంగా నష్టాన్ని ఇంకా నివేదించలేదు. NZలో 5 మిలియన్ల జనాభా ఉంది. భూకంపాలు, అగ్నిపర్వతాలు సర్వసాధారణమైన పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఈ దేశం ఉంది.






