అల్లు అర్జున్ నటించిన Pusha-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో గాయపడిన శ్రీతేజ్(Sritej) డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 5న ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా HYD సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 5 నెలల సుదీర్ఘ చికిత్స అనంతరం ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)లో చికిత్స పొందిన శ్రీతేజ్ ఆరోగ్య(Sritej Health) పరిస్థితి కొంత నిలకడగా ఉండటంతో వైద్యులు అతడిని డిశ్చార్జ్(Discharge) చేసి, తదుపరి సంరక్షణ కోసం రిహాబిలిటేషన్ కేంద్రాని(Rehabilitation Center)కి తరలించాలని సూచించారు. తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి(Revathi) మరణించిన విషయం తెలిసిందే.
రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలింపు
శ్రీతేజ్ మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. 15 రోజుల క్రితం ICU నుంచి సాధారణ గదికి మార్చినట్లు అతని తండ్రి భాస్కర్(Bhaskar) తెలిపారు. బాలుడి ఆరోగ్యం ఇన్ఫెక్షన్లు లేకుండా నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. అయితే, ఫిజియోథెరపీ, సంరక్షణ కోసం రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ సుమారు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ(Physiotherapy) అందించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లవచ్చని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఎవరినీ గుర్తుపట్టడం లేదు: శ్రీతేజ్ తండ్రి
శ్రీతేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తండ్రి భాస్కర్ మాట్లాడుతూ, “బాబు ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తున్నాడు. ద్రవాహారాన్ని పైపు ద్వారా అందిస్తున్నాం. అయితే, మెదడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మమ్మల్ని ఎవరినీ గుర్తుపట్టడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉంటే ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుందని, రిహాబిలిటేషన్‌కు వెళితే కొంత మెరుగుదల ఉండొచ్చని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. శ్రీతేజ్‌ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని భాస్కర్ తెలిపారు. తమకు అండగా నిలిచిన వారికి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.
Sreetej, An 8 Year old kid who was severely injured in Sandhya theatre stampede last December was discharged from KIMS hospital after 5 months of treatment. Kid parents likely admit him in rehabilitation centre for physiotherapy treatment. @alluarjun #Pushpa2TheRule #AlluArjun pic.twitter.com/xLMmlgpTlZ
— Telangana Express (@XpressTG) April 29, 2025






