Mana Enadu: ఆధార్ కార్డు(Aadhaar card) విషయంలో భారత అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పుట్టున తేదీ(Date of Birth)కి ఆధార్ కార్డు అధికారిక ప్రూఫ్(Official proof) కాదని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది. పాఠశాల రికార్డు(School records)ల్లో ఉండే తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదం(motor accident compensation case)లో బాధితుడికి పరిహారం మంజూరు చేసే వ్యవహారంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి(A person died in a road accident)కి సంబంధించి రూ.19.35లక్షల పరిహారం ఇవ్వాలని రోహ్‌తక్‌లోని మోటార్ యాక్సిడెంట్ ట్రైబ్యునల్(Motor Accident Tribunal at Rohtak) తీర్పు ఇచ్చింది. అనంతరం ఈ కేసు హైకోర్టుకు చేరింది.
దీనిపై విచారించిన స్థానిక ట్రైబ్యునల్(Local Tribunal) వయసును తప్పుగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న సుప్రీంకోర్టు.. పరిహారాన్ని రూ.9.22లక్షలకు కుదించింది. బాధితుడి ఆధార్‌కార్డు ఆధారంగా వయసు 47ఏళ్లగా నిర్ధరించి పరిహారం లెక్కకట్టినట్లు తెలిపింది. ఆధార్ కార్డు ఆధారంగా వయసును పరిగణనలోకి తీసుకొని హైకోర్టు పరిహారం లెక్కకట్టిందని పేర్కొంటూ బాధిత కుటుంబీకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పాఠశాల రికార్డుల ప్రకారం అతడి వయసు 45ఏళ్లు మాత్రమేనని వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరపిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్(Justices Sanjay Karol and Ujjal Bhuyan)లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్(Motor Accident Claims Tribunal) ఇచ్చిన తీర్పును సమర్థించింది.