Coolie: కూలీ’లో ఆమిర్ ఖాన్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్చల్!

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth ) నటిస్తున్న 171వ చిత్రం ‘కూలీ’(Coolie) ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటిసారి తలైవా లోకేష్ కాంబినేషన్‌ రావడంతో భారీ హైప్‌ నెలకొంది. ఈ పాన్‌ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాను ఆగస్టు(August) 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా జూలై 3న విడుదలైన ఆమిర్ ఫస్ట్ లుక్(First Look in Coolie) సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ‘దహా'(Daha) అనే పాత్రలో కనిపించే ఆమిర్ ఖాన్.. రఫ్, ఇంటెన్స్ లుక్‌తో అభిమానుల మతులు పోగొట్టేశాడు.

ఈ లుక్‌లో ఆమిర్ నల్లటి వెస్ట్ వేసుకొని, ఓ పైప్‌ను కాలుస్తూ కనిపించాడు. ఆయన చరిత్రలో ఇదొక డిఫరెంట్ అవతార్ అని అభిమానులు పేర్కొంటున్నారు. గెస్టాఫ్ అప్పియరెన్స్ అయినా, ఈ పాత్రకు కథలో కీలక ట్విస్ట్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ‘కూలీ’లో సౌత్, నార్త్ స్టార్ కాంబినేషన్ చూడటం ఇదొక స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. “మోస్ట్ అవేటెడ్ క్యారెక్టర్!” అంటూ కొంతమంది ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తుండగా, మరికొందరు “మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ లోకేష్ ఫ్రేమ్‌లో.. డ్రీమ్ కాంబో!” అంటూ మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్, ఆమిర్ ఖాన్, నాగార్జున అక్కినేని(Nagarjuna), ఉపేంద్ర(Upendra), సౌబిర్ షబీన్, శ్రుతిహాసన్(Sruthu Hasan) వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, పూజా హెగ్డే(Pooja Hedge) ఓ ప్రత్యేక సాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా దాదాపు రూ.375 కోట్లతో తెరకెక్కుతోంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి విజయవంతమైన యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).. ‘కూలీ’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *