సినిమా హీరోల అభిమానుల మధ్య వార్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఈ ఫ్యాన్ వార్స్ మరీ దారుణ స్థితికి చేరాయి. స్టార్ హీరోలు వారి సినిమాలు వారు చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటే.. వాళ్ల అభిమానులు మాత్రం బద్ధశత్రువులుగా సోషల్ మీడియాలో వార్ చేస్తున్నారు. ఈ విషయాలపై తాజాగా కోలీవుడ్ స్టార్, అజిత్ (Ajith Kumar) స్పందించారు.
జై అజిత్.. జై విజయ్ అంటూ ఉంటే..
దుబాయ్‌లో జరిగిన 24 హెచ్ కార్ రేసింగ్ పోటీల్లో అజిత్ జట్టు (ajith kumar racing team) మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్ వార్స్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మాట్లాడారు. పక్కవాడి విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. జై అజిత్.. జై విజయ్ అంటూ ఉంటే.. ఇంకా నువ్వెప్పుడు నీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తావు అంటూ ఫ్యాన్స్ కు ఓ రిక్వెస్ట్ చేశారు అజిత్.
Tamil superstar Ajith Kumar saying the right things.. pic.twitter.com/AjbCYhbtKZ
— Keh Ke Peheno (@coolfunnytshirt) January 14, 2025
మీరు హ్యాపీగా ఉండాలి
‘‘ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పని సక్రమంగా, కష్టపడి చేయండి. మీ పక్కనున్న వ్యక్తి అది చేస్తున్నాడు.. ఇది చేస్తున్నాడని హైరానా పడకండి. దాని వల్ల మీకేం ఉపయోగం ఉండదు. మీ లైఫ్ పై మీరు కాన్సంట్రేట్ చేయండి. నేను నా అభిమానులకూ ఇదే చెబుతాను. సినిమాలు చూడటం వరకు ఓకే. కానీ ‘జై అజిత్.. జై విజయ్..’ అంటూ ఉంటే, నువ్వెప్పుడు జీవిస్తావు. మీరు చూపిస్తున్న ప్రేమను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మీరు మీ లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండి, మీరు హ్యాపీగా ఉన్నారని తెలిస్తే నాకు ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది.
జాలీగా గడపండి
లైఫ్ చాలా చిన్నది. మన ఫ్యామిలీలో ముందు తరం కూడా మనల్ని గుర్తుపెట్టుకోదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి క్షణం ఆస్వాదించండి. జరిగిపోయిన దాని గురించి బాధపడొద్దు. జరగాల్సిన దాని గురించి భయపడొద్దు. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయండి. ఏదో ఒక రోజు మనం చనిపోతాం. అప్పటివరకు కష్టపడి పని చేస్తూ జాలీగా గడపండి. శారీకరంగానే కాదు, మానసికంగానూ హ్యాపీగా గడపండి.’’ అని అజిత్ అన్నారు.
When Ajith Kumar Sir speaks, we listen❤️🫶 pic.twitter.com/29dzLceVJR
— Manoj Maddy (@edits_manoj) January 13, 2025







