
బాలీవుడ్(Bollywood)లో విషాదం చోటుచేసుకుంది. నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ తల్లి, నిర్మల్ కపూర్(90) కన్నుముశారు. ఇవాళ సాయంత్రం (మే 2) 5:45 గంటల ప్రాంతంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్(Dhirubhai Ambani Hospital)లో ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని అనిల్ కపూర్(Anil Kapoor) ఇంటికి తరలించారు. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతపట్ల సంతాపం తెలుపుతున్నారు.
Actor Anil Kapoor’s mother passes away in Mumbai.
“Nirmal Kapoor passed away peacefully at the hospital around 5.25 pm today,” says Dr Santosh Shetty, CEO and Executive Director, Kokilaben Ambani Hospital pic.twitter.com/hNWomSzurA
— Navjot S. Dhaliwal (@DhaliwalNavjot5) May 2, 2025
నిర్మల్-సురీందర్ కపూర్ ఫ్యామిలీ ఇదే..
నిర్మల్ కపూర్(Nirmal Kapoor) 2024సెప్టెంబర్‌లో తన 90వ పుట్టినరోజును జరుపుకున్నారు. ప్రస్తుతానికి, ఆమె మరణం గురించి కపూర్ కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా నిర్మల్ కపూర్ ప్రముఖ చిత్ర నిర్మాత అయిన సురీందర్ కపూర్(Surinder Kapoor)ను వివాహం చేసుకున్నాడు. వీరికి అనిల్ కపూర్, రీనా కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్ పిల్లలు. కాగా నిర్మల్ మనవళ్లలో సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషి, అన్షు, అర్జున్ కపూర్, షానయ కపూర్, జహాన్ కపూర్ ఉన్నారు.