Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్-2, కల్కి-2, ది రాజా సాబ్, స్పిరిట్ (Spirit Movie), ఫౌజీ (వైరల్ టైటిల్) సినిమాలున్నాయి. వీటిలో ది రాజా సాబ్ సినిమా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రభాస్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. ఇక అక్టోబర్ 23ల తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజా సాబ్ టీమ్ డార్లింగ్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే అంతకంటే ముందే ఇవాళ మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
రాజాసాబ్ రాయల్ లుక్ అదుర్స్
మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజా సాబ్ (The Raja Saab)’ నుంచి తాజాగా మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ హ్యాండ్సమ్ కనిపిస్తున్నాడు. బ్లాక్ ప్యాంట్, చెక్స్ షర్ట్ తో.. కళ్లకు గాగుల్స్ పెట్టుకని ప్రభాస్ స్టైలిష్ గా కనిపించాడు. ఫుల్ స్వాగ్ లో ఉన్న పోస్టర్ (Raja Saab New Poster) ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డార్లింగ్ లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
డార్లింగ్ బర్త్ డే సర్ ప్రైజ్
ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. స్వాగ్ అదిరిపోయింది.. స్టైల్ గా రాజాసాబ్ సెలబ్రేషన్స్ సాగుతాయి. అసలైన రాయల్ ట్రీట్ అక్టోబర్ 23న ఉండబోతోంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు (Prabhas Birth Day) అని తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి సూపర్ సర్ ప్రైజ్ ఉంటుంది గత కొన్ని రోజులుగా మేకర్స్ ఊరిస్తూ వస్తున్నారు.
వచ్చే ఏడాది రిలీజ్
కామెడీ, హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
A journey we built.
A Darling Rebel character we shaped 🙂HE IS ARRIVING on 23rd oct 🔥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/Da7MPyLnpV
— Director Maruthi (@DirectorMaruthi) October 21, 2024