గెలుపుదేముందిరా మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.. ఒక్కసారి ఓడిపోయి చూడు.. ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది.
దేవుడు మనుషులను ప్రేమించడానికి, వస్తువులను వాడుకోవడానికి సృష్టించాడు. కానీ మనమే కన్ఫ్యూజన్ తో మనుషులను వాడుకుంటున్నాం. వస్తువులను ప్రేమిస్తున్నాం
ఇక్కడ గడిచిన జీవితం మొత్తం కాలం విలువేంటో చూపిస్తే.. ఇక్కడ గడిచిన రెండేళ్ల కాలం మాత్రం జీవితం ఏంటో చూపించింది.
ఒక రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో, మనిషిలో మనిషిని మాత్రమే ఎలా చూడాలో, ఎలా కలిసిపోవాలో ఎలా నవ్వాలో, ఆఖరికి ఎలా ఏడ్వాలో కూడా ఇక్కడే నేర్చుకున్నాను.
Mana Enadu : ఈ డైలాగ్స్ అన్ని చూస్తుంటే సినిమా ఏంటో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదూ. అదేనండి నేచురల్ స్టార్ నాని (Actor Nani) కెరీర్ లోని ది బెస్ట్ సినిమాల్లోని ఫస్ట్ ఐదింట్లో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది. అదే ‘పిల్ల జమీందార్ (Pilla Zamindar)’ చిత్రం. ఈ మూవీలో కామెడీతో పాటు ఎమోషన్, సామాజిక, మానవత్వ విలువలు ఈ చిత్రాన్ని నాని కెరీర్ లో టాప్ లో నిలిపాయి. ఈ సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్.
ఇంతకీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామనేగా మీ డౌటు. ఎందుకంటే.. ఈ సూపర్ హిట్ ‘పిల్ల జమీందార్’ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ రాబోతోంది. సీక్వెల్ లోనూ నాని హీరోగా నటిస్తున్నాడు. 2011లో రిలీజైన ‘పిల్ల జమీందార్’కు సీక్వెల్(Pilla Zamindar 2) తీస్తున్నట్లు ఆ సినిమా ప్రొడ్యూస్ర్ డి.ఎస్.రావు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు.
జి.అశోక్ (Director Ashok) డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నానితో పాటు హరిప్రియ (Hari Priya), బిందుమాధవి, ధన్రాజ్, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్, సత్య, వెన్నెల కిషోర్ (Vennela Kishore) నటించారు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీని యూట్యూబ్ లో ఇప్పటికీ చాలా మంది చూస్తుంటారు. ఇక టీవీలో వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వరు. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ రానుందనే వార్త వైరల్ కావడంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక నాని ఇటీవల ‘సరిపోదా శనివారం (saripodhaa sanivaaram)’ తో హ్యాట్రిక్ కొట్టాడు.. ప్రస్తుతం ‘హిట్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ‘దసర’ దర్శకుడు శ్రీకాంత్ తో ఓదెల-2 లో నటించనున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నాడు.