Mana Enadu : ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. నీయమ్మ తగ్గేదేలే’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇక పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు పుష్ప-2 (Pushpa 2) కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తరచూ మేకర్స్ ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
వీళ్ల కాంబోలో ఐటమ్ సాంగ్స్ కు భలే క్రేజ్
ఇక పుష్ప సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ‘ఊ అంటామా మావ.. ఊ ఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప-2లోనూ ఓ సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ (Sukumar) – మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). వీరి కాంబోలో ఐటమ్ సాంగ్స్ కు చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
పుష్ప-2 కోసం బాలీవుడ్ బ్యూటీ
ఇక ఈ కాంబోలో ఇప్పుడు ‘పుష్ప2’లోనూ (Pushpa 2) అదిరిపోయేలా ఐటమ్ సాంగ్ రెడీ అవుతోందట అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో చేయించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇటీవలే స్త్రీ-2 సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ను ఈ సాంగ్ కోసం సంప్రదించాలని అనుకుంటున్నారట.
త్వరలోనే పుష్ప-2 ఐటమ్ సాంగ్
‘సాహో (Sahoo)’ సినిమాతో శ్రద్ధా కపూర్ తెలుగు వారికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈ విషయమై చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐటమ్ సాంగ్ పూర్తి చేసి, రిలీజ్ చేస్తే సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు నెమ్మదిగా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
డిసెంబర్ 6వ పుష్ప 2 రిలీజ్
డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సునీల్, అనసూయ, ధనుంజయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.