Mana Enadu : కోలీవుడ్ హీరో కార్తి(Karthi) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కార్తి నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతుంది. చాలా సినిమాలు తమిళంలో కంటే ఎక్కువగా తెలుగులోనే హిట్ అయ్యాయంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ హీరోపై ఉన్న ప్రేమ గురించి అర్థం చేసుకోవచ్చు. తమిళ హీరో అయినా కార్తి తన సినిమాల్లో తెలుగు డబ్బింగ్ తానే చెప్పుకుంటాడు. అందుకే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక తాజాగా ఈ యంగ్ హీరో వెటరన్ నటుడు అరవింద్ స్వామి (Arvind Swami)తో కలిసి ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమాయే ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram).
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి, అరవింద్ స్వామి బావ, బావమరిదిగా నటించారు. శ్రీదివ్య (Sri Divya) కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కార్తి, అరవింద్ స్వామి నటనకు, వాళ్లిద్దరి మధ్య బాండింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక థియేటర్లో ఈ సినిమా చూడటం మిస్ అయిన వాళ్లు ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
కార్తి ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఓ సూపర్ న్యూస్. ‘సత్యం సుందరం (Sathyam Sundaram Ott)’ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 27వ తేదీ నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్లో ఈ కామెడీ డ్రామాను వీక్షిస్తూ జాలీగా ఎంజాయ్ చేయండి.