Mana Enadu : సినిమా ఇండస్ట్రీలో పని చేస్తూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తూ స్నేహంగా పలకరించి.. ప్రేమ చిగురించి.. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటైన వారు కోకొల్లలు. ఇక అలాగే సినిమా డైరెక్టర్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకున్న హీరోయిన్లు కూడా చాలా మందే ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara).
ఆ సినిమాతో నా లైఫ్ ఛేంజ్
‘నేను రౌడినే (nenu rowdy ne)’ అనే సినిమాలో నటించిన నయనతార ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకు ఇద్దరు పండంటి మగ బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడిందని ఇప్పటికే ఈ జంట చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలై 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా నయనతార సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టు షేర్ చేశారు. విఘ్నేశ్‌కు (Vignesh Shivan) థ్యాంక్స్ చెబుతూ ఈ మూవీ తన లైఫ్‌ను ఎలా ఛేంజ్ చేసిందో చెప్పారు.
థాంక్యూ విక్కీ
‘‘నేను రౌడీనే.. ఈ సినిమా నా లైఫ్‌ను శాశ్వతంగా మార్చేసింది. నా కెరీర్‌ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ ఇచ్చి 9 ఏళ్లు (9 Years Of nenu rowdy ne) పూర్తయింది. ఇది నాకు ఎన్నో మరిచిపోలోని మెమోరీస్ అందించింది. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసి మరింత మెమోరబుల్‌గా మార్చిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన విఘ్నేశ్‌కు థాంక్యూ. ఈ సినిమా నాకు నా లైఫ్‌లో అత్యంత విలువైన వ్యక్తి విఘ్నేశ్‌ను ఇచ్చింది’’ అని నయనతార తన పోస్టులో రాసుకొచ్చారు.
2022లో విఘ్నేశ్ -నయనతార వివాహం
2015లో విడుదలైన ‘నేను రౌడినే’లో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా నటించగా నయనతార ఈ చిత్రంలో చెవిటి అమ్మాయిగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌లోనే నయనతార, విఘ్నేశ్‌లు స్నేహితులయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారింది. ఇది విడుదలైన ఏడేళ్ల తర్వాత 2021లో వీళ్ల ప్రేమ గురించి అందరికీ చెప్పి.. 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ పుట్టారు.