పెళ్లి పీటలెక్కబోతున్న SVSC నటి.. వరుడు ఎవరు?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో పలు సినిమాల్లో నటించి తన టాలెంట్ నిరూపించుకుంది నటి అభినయ (Actress Abhinaya). చెవులు వినపడకున్నా, మాటలు రాకున్నా తన ముఖంలో అన్ని రకాల హావభావాలు పలికిస్తూ నటనకు మాటలు రావాల్సిన అవసరం లేదని నిరూపించింది. టాలెంట్ ఎవరి సొత్తు కాదని బల్ల గుద్ది చెప్పింది. అభినయ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC)’, శంభో శివశంభో, ఢమరుకం, ధృవ (Dhruva) వంటి సినిమాల్లో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

అభినయ వివాహం

ఇలా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో పలు సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అయితే కొంతకాలంగా అభినయ, కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Actor Vishal) ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా అభినయ (Abhinaya Engagement) తనకు నిశ్చితార్థం జరిగినట్లు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. తనకు కాబోయే వరుడు ఎవరో మాత్రం రహస్యంగా ఉంచింది.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)

ఇంతకీ ఏమైందంటే..?

తాజాగా అభినయ తనకు కాబోయే భర్త (Abhinaya Husband)తో కలిసి గుడి గంటను మోగిస్తూ.. చేతులు మాత్రమే కనిపిస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ ఫొటోలో ఇద్దరి చేతి వేలికి ఉంగరం ఉంది. అలా తనకు నిశ్చితార్థం జరిగిందని ఈ భామ పోస్టు పెట్టింది. ఈ పోస్టు కింద..  ‘మమ్మల్ని మీ మంచి మనసుతో ఆశీర్వదించండి.. ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు కానుంది’ అంటూ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. అయితే తాను పెళ్లాడబోయేది ఎవరినో మాత్రం చెప్పలేదు. వరుడి ముఖం కూడా చూపించలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Posts

కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde

సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…

చిరు-అనిల్ రావిపూడి సినిమా ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను అనిల్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *