
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఖుషి తర్వాత ఈ భామ నుంచి తెలుగులో ఒక్క చిత్రం రాలేదు. ఆ మూవీ తర్వాత మయోసైటిస్ వ్యాధి వల్ల ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఓవైపు అనారోగ్యం, మరోవైపు విడాకులతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత హిందీలో వరుస ప్రాజెక్టులు చేస్తోంది. ఇటీవలే సొంత ఫిల్మ్ ప్రొడక్షన్ ప్రారంభించి మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) అనే సినిమా ప్రకటించింది.
View this post on Instagram
తెలుగు తెరపైకి సమంత రీ ఎంట్రీ
అది కాకుండా సమంత తెలుగులో మరే చిత్రం చేయడం లేదు. ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు. అయితే సామ్ ను ఇప్పట్లో వెండితెరపై చూడలేమని అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. అయితే వారికి కిక్ ఇచ్చే ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సామ్ (Samantha Telugu Movies) టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఖాయమైందంటూ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. సమంత త్వరలోనే ఓ తెలుగు సినిమాలో కనిపించబోతోందట. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్. ఈ భామ ఆ సినిమాలో హీరోయిన్ కాదట. అసలు సంగతి ఏంటంటే..?
. @dulQuer bringing #Paradha in Malayalam to audiences worldwide through @DQsWayfarerFilm 🔥 pic.twitter.com/w6qPXmt5GT
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) January 29, 2025
అనుపమ సినిమాలో సామ్
టాలీవుడ్ కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran) గురించి తెలుసు కదా. ఈ భామ ప్రస్తుతం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో పరదా (Paradha) అనే ఓ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమతో పాటు మరో ఇద్దరు నటీమణులు సంగీత క్రిష్, దర్శన రాజేంద్రన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్ (Samantha in Paradha movie) లో కనిపించనుందట. ఈ మూవీలో నటించాలని అనుపమ సామ్ ను కోరగా.. తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కోసం సామ్ ఓకే చెప్పిందట. ఈ విషయం తెలిసి సమంత ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…