‘బంధీ’గా వెండితెరపై ఆదిత్య ఓం రీఎంట్రీ

టాలీవుడ్ నటుడు ఆదిత్య ఓం (Aditya Om) చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్-8లో మెరిసిన ఈ నటుడు తాజాగా ‘బంధీ (bandi)’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. రఘు తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశాన్ని ఇస్తూ ఈ సినిమా ఉండనుంది.

బంధీ సినిమాకు ప్రశంసలు

గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాను ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవాల్లో బంధీ చిత్రానికి అనేక ప్రశంసలు దక్కాయి. భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా బంధీ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోంది. భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ మధ్య బంధీ చిత్రాన్ని తెరకెక్కించారు.

అద్భుతమైన విజువల్స్‌

అద్భుతమైన విజువల్స్‌ను ఈ చిత్రంలో చూడబోతోన్నాం. పర్యావరణ ప్రేమికులందరినీ కదిలించేలా ఈ చిత్రం ఉండనుంది. ఎంతో డెడికేటెడ్ యాక్టర్ అయిన ఆదిత్య ఓం బంధీ చిత్రంలో ఎన్నో రియల్ స్టంట్స్ చేశారు. అటవీ ప్రాంతంలో అనేక ఛాలెంజ్‌లు ఎదుర్కొంటూ అద్భుతంగా నటించారు. ఈ మూవీని ఇక ఆడియెన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్లు నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. నిర్మాతలు వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం NGOలు, సామాజిక సంస్థలతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *