
ఆలియా భట్(Alia Bhatt).. RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారింది. అందం, అద్భుత నటనతో బాలీవుడ్(Bollywood)లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఆలియా మరో అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నటీమణుల లిస్టులో రెండో ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ హైప్ ఆడిటర్ నివేదిక ప్రకటించారు. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్(Dwayne Johnson), జెన్నిఫర్ లోపెజ్(Jennifer Lopez)లను అధిగమించి, జెండయా తర్వాత స్థానంలో నిలిచారు. దీంతో అభిమానులు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.
85 మిలియన్లకు పైగా ఫాలోవర్లు
సోషల్ మీడియా(Social Media)లో ఆలియాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్‌స్టాలో ఈమెకు 85 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలియా తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానుల(Fans)తో పంచుకుంటుంటారు. అంతేకాదు ఫొటో షూట్‌లతో ఆకట్టుకుంటుంటారు. ఆలియా గతేడాది కూడా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన వంద మోస్ట్ ఇన్‌ప్లూయెన్షియల్ పీపుల్-2024 జాబితాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
View this post on Instagram
‘ఫౌజీ’లో యువరాణి పాత్రలో ఆలియా?
కాగా గంగూబాయి కతియావాడి, RRR, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ వంటి చిత్రాలతో ఆలియా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 2022 ఏప్రిల్ 14న రణబీర్ కపూర్(Ranbir Kapoor)ని వివాహం చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. వీరికి ఓ పాప. ప్రస్తుతం ఆలియాకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా ఫౌజీ(Fouji) అనే మూవీ తెరకెక్కుతోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్ కూడా నటించబోతున్నట్టు గతకొద్ది రోజులగా టాక్ నడుస్తోంది. ఇందులో ఆలియా ఓ యువరాణి పాత్రలో నటిస్తున్నట్లు టాక్.