ManaEnadu:కస్టమర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) పండుగ వేళ అతిపెద్ద సేల్‌కు రంగం సిద్ధం చేసింది. ప్రతి ఏటా నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival 2024) డేట్స్ ను ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వారికి ఒక రోజు ముందే ఈ సేల్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ మొదలు కానుందన్నమాట. ఇక ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ డేస్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో ఎస్‌బీఐ కార్డు (SBI Cards) యూజర్లకు డిస్కౌంట్ లభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు ఉంటుందని వెల్లడించారు. మరోవైపు అమెజాన్ పే యూపీఐ (Amazon Pay UPI)తో చేసే రూ.1000పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్ అనౌన్స్ చేశారు. అయితే దేనిపై ఎంత డిస్కౌంట్ ఇచ్చేది మాత్రం సేల్ మొదలయ్యే రోజే తెలియనుంది.
గ్రేట్ ఇండియన్ సేల్‌లో మొబైల్స్ (Mobile Offers) కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. ఈ సేల్ లో భాగంగా రూ.5,999 నుంచే మొబైల్స్ విక్రయించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. మొబైల్ యాక్సెసరీస్ రూ.89 నుంచే ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉందని చెప్పారు. స్మార్ట్‌టీవీల ధరలు రూ.6,999 నుంచే ప్రారంభమవుతాయట. అమెజాన్ అలెక్సా, ఫైర్‌టీవీ స్టిక్ డివైజులు రూ.1,999 నుంచి మొదలవుతాయట. ఈ సేల్ సమయంలో ట్రావెల్ బుకింగ్‌లపైనా డిస్కౌంట్ పొందొచ్చని అమెజాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు కూపన్లు కూడా జారీ చేయనుంది.