రేపటి నుంచి (ఫిబ్రవరి 24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు పాటు నిర్వహించాలనే దానిపై బీఏసీ మీటింగ్(BAC Meeting) జరుగుతుంది. కాగా మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఇక ఈనెల 26న మహా శివరాత్రి(Maha Shivaratri) కావడం, 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections) నేపథ్యంలో సభ ఉండదు.
ఆ రోజు బడ్జెట్‌పై చర్చ
తిరిగి మళ్లీ 28న సభ ప్రారంభానికి ముందే సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో బడ్జెట్(Budget)పై చర్చ, ఆమోద ముద్ర వేస్తారు. అనంతరం అదే రోజు సభలో2025-26కి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) సభలో ప్రవేశపెడతారు. అనంతరం మార్చి 3వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. కాగా సమావేశాల సమయంలో సభలో ప్రదర్శనలు, ధర్నాలు, భైఠాయింపులను పూర్తిగి నిషేధించినట్లు స్పీకర్ ఆదేశాల మేరకు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న వైసీపీ?
ఇదిలా ఉండగా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని YCP అధినేత వైఎస్ జగన్(YS Jagan) నిర్ణయించారు. వైసీపీ MLAలు, MLCలు గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్నారు. మంగళవారం నుంచి అసెంబ్లీకి హాజరుపై జగన్ ఇంకా నిర్ణయానికి రాలేదని సమాచారం. శాసనసభకు, బడ్జెట్ సమావేశాలకు రావడంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలు(Assembly Committee Hall)లో సమావేశం కానున్నారు.









