ఇక కిక్కే కిక్కు.. ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు.. నేటి నుంచి దరఖాస్తులు

Mana Enadu : మందుబాబులకు గుడ్ న్యూస్. ఏపీలో నూతన మద్యం విధానాన్ని (AP Liquor Policy) రాష్ట్ర సర్కార్ తాజాగా ఖరారు చేసింది. రెండేళ్ల కాల పరిమితితో ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 2026 సెప్టెంబరు 30వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. మొత్తం 3వేల 396 మద్యం దుకాణాలకు లైసెన్సుల (Liquor Shops License) జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇవాళ ఉదయం (అక్టోబర్ 1వ తేదీ 2024) నుంచే దరఖాస్తుల (AP Liquor Policy Application) స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చని.. ఒక్కో దానికి రూ.2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాలని వెల్లడించింది.

డెబిట్, క్రెడిట్‌ కార్డుల (Credit Card) ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలని పేర్కొంది. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలని.. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నట్లు తెలిపింది.  ఈ నెల 11వ తేదీన లాటరీ ప్రక్రియ ఉండగా.. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు.

  • దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు.
  • తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు
  • ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు
  • రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు.
  • ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి.
  • రిటైల్‌ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్‌ ఉంటుంది.
  • నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్‌ స్టోర్స్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున అదనంగా లైసెన్సు రుసుము చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మంగళవారం ఉదయం 10 గంటల నుంచి
  • తుది గడువు: అక్టోబరు 9 వరకూ
  • లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేసేది: అక్టోబరు 11
  • లైసెన్సులు దక్కించుకున్న వారు దుకాణాలు ప్రారంభించే తేదీ: అక్టోబరు 12 నుంచి

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *