మన ఈనాడు:నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణ రివర్ బోర్డు కీలక ఆదేశాలుఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది.
ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది.
మూడు దశల్లో నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 10 నుండి 20 వరకు 5 టీఎంసీలు, జనవరి 8 నుండి 18 వరకు 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుండి 24 వరకు 5 టీఎంసీలు వాడుకునే విధంగా ఒప్పందం చేసుకున్నాయి ఇరు రాష్ట్రాలు. కాగా, అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేసినట్లు బోర్డు పేర్కొంది. ఇక వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ లో నీటిని విడుదల చేయాల్సి ఉందని బోర్డు తెలిపింది.
ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది. తెలంగాణవైపు పోలీసు బలగాలు పెంచుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు తాజా వివాదంతో ఇరిగేషన్ అధికారులతో ఇరు రాష్ట్రాల సీఎస్ లు సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ డ్యామ్ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని కేంద్ర అధికారులను, కృష్ణ రివర్ బోర్డు మేనేజ్ మెంట్ అధికారులను తెలంగాణ ఆఫీసర్స్ కోరుతున్నారు. దీనిపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.