Telangana Congress CM: తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి..కాసేపట్లో ప్రకటన

మన ఈనాడు:  సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశంలో.. ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించారు పరిశీలకులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఏకవాక్య తీర్మానాన్ని.. భట్టి, ఉత్తమ్‌ సహా పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు.

సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశంలో.. ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించారు పరిశీలకులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఏకవాక్య తీర్మానాన్ని.. భట్టి, ఉత్తమ్‌ సహా పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు. ఢిల్లీ నుంచి కాసేపట్లో నిర్ణయం వెలువడనుంది. సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా డీకే శివకుమార్‌తో పాటు దీప్‌దాస్‌ మున్షీ, జార్జ్‌, అజయ్‌, మురళీధరన్‌ హాజరయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. ఆ మేరకు ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు.
హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి సీఎల్పీ నేత ఎంపిక జరుగుతుంది. అనంతరం CLP నిర్ణయాన్ని రాజ్‌భవన్‌కు తెలుపుతుంది కాంగ్రెస్‌ పార్టీ. అధిష్టానం నిర్ణయం వచ్చిన వెంటనే సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం ఇప్పటికే గవర్నర్‌తో సమావేశమైన కాంగ్రెస్‌ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిదిగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజ్‌భవన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజ్‌భవన్‌ దగ్గర బందోబస్తును కూడా పెంచారు పోలీసులు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *