మన ఈనాడు:యువగళం ముగింపు సభ విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ సభకు చంద్రబాబు, జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు.. టీడీపీ పార్టీ (TDP Party) ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టి ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇటీవల రెండో విడత యువగళం పాదయాత్ర ను మొదలు పెట్టిన లోకేష్.. నిన్నటితో యువగళం పాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ నేతలు విజయవాడలో యువగళం ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు కానున్నారు.
మొత్తం 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. యువగళం ముగింపు సభకు దాదాపు 6 లక్షల మంది హాజరు అవుతారని అంచనా వేశారు.50 వేల మంది కూర్చొని బహిరంగ సభను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ విజయోత్సవ సభ నిర్వహణకు మొత్తం 16 కమిటీలను వేశారు. స్టేజి 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుఠీ స్టేజి ఉండనుంది. స్టేజిపై 600 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు విక్షించేందుకు స్టేజి వెనుకాల 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
ఈ సభ కోసం టీడీపీ పార్టీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఈ సభ కొరకు 7 ప్రత్యేక రైళ్లను ఏర్పర్చు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ప్రజలు, టీడీపీ అభిమానులు విజయవాడకు చేరుకోనున్నారు. పార్కింగ్ కోసం ఉత్తరాంద్ర వైపు 2 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. విశాఖ వైపు 2 పార్కింగ్ స్థలాలు, ఒక్కో పార్కింగ్ స్థలం 50 ఎకరాల్లో ఏర్పాటు. భోగాపురం వచ్చే వారందరికి భోజన ఏర్పార్లు చేశారు. మధ్యాహ్నం
3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది.