మన ఈనాడు:ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించనున్నారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవ్వనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై, మంత్రివర్గ విస్తిరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారు. దీనిపై ఈ రోజు సాయంత్రానికి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలో వచ్చిన తరువాత సీఎం రేవంత్ ఇప్పటివరకు ఢిల్లీ పెద్దలను కలవలేదు, అయితే, ఈరోజు ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలను (Amit Shah) మొదటి సారి సీఎం అయిన రేవంత్ మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు సమాచారం. తెలంగాణకు రావాల్సిన నిధులపై, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం కావాలని వారిని కోరనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Redd) తెలంగాణ అభివృద్ధి కోసం పని చేద్దాం అంటూ లేఖ రాసిన విషయం తెలిసిందే.
ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…