జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన 42 మంది విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన 42 మంది విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన విద్యార్థులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా ఆస్పత్రి సర్వీసెస్ కోఆర్డినేటర్ పాల్ సతీష్ తెలిపారు. బాలుర హాస్టల్‌లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వెంటనే వైద్య శిబిరం నిర్వహించి చికిత్స అందించామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
వీరిలో ఇద్దరిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం బాగుపడే వరకు హాస్టల్‌లో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ పాల్ సతీష్ తెలిపారు.