నిరుద్యోగులకు మరో అవకాశం.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్

మన ఈనాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్న కారణంగా వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు పలు బోర్డుల ద్వారా

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి పెంచుతూ గవర్నమెంట్ సర్కూలర్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు పలు బోర్డుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. యూనిఫామ్,నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు కేటగిరీలుగా గరిష్ట వయోపరిమితి ఉంది.

తాజాగా యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ని ప్రస్తుతం ఉన్న దానికి రెండేళ్లు అదనంగా పెంచింది.ఇక నాన్ యూనిఫామ్ అభ్యర్థుల కి జనరల్ కెటగిరీకి ఉన్న 34 ఏళ్ల గరిష్ట వయసును 42 ఏళ్లకు పెంచింది.

దీంతో పాటు రిజర్వ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం ఉండే అదనపు వయోపరిమితి కూడా వర్తిస్తుంది… వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకూ నిర్వహించే అన్ని ఉద్యోగాల భర్తీకి ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.త్వరలో గ్రూపు 1,గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *