గులాబీ మేనిఫెస్టో రేపే విడుద‌ల‌

మ‌న ఈనాడుః షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్ మీద ఉన్నాయి పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే స్పీడుమీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. ఆదివారం నుంచి గులాబీ ద‌ళ‌ప‌తి రంగంలోకి దిగ‌బోతున్నారు.

అక్టోబర్ 15వ తేదీన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. అంతేగాకుండా హుస్నాబాద్‌లో ప్ర‌చార స‌భ‌ సమరశంఖం పూరించేందుకు రెడీ అయ్యారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతోందని కేటీఆర్ ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌సంగించారు. ఈసారి మేనిఫెస్టో సరికొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందంటుని ప్ర‌జ‌ల్లోకి తీసుక‌పోతున్నారు. కాగా బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగించడతోపాటు కొత్త ప‌థ‌కాలు తీసుకొస్తున్నారు.

బీఆర్ ఎస్ మేనిఫెస్టో
☛ ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగింపు

☛ రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు

☛ రైతాంగం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత

☛ రైతుబంధు, రైతు బీమా నగదు పెంచే అవకాశం

☛ మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ

☛ దిగువ, మధ్యతరగతి కుటుంబాల కోసం కొత్త పథకాలు

☛ ఒంటరి మహిళలు, బీసీలు, మైనారిటీల కోసం స్పెషల్ స్కీమ్స్‌

☛ దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుపై మరింత ఫోకస్‌

☛ యువత, గృహిణులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలు

హుస్నాబాద్ సభకు ఏర్పాట్లు..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 15న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తయిందని, సభాస్థలి వేదిక పనులు రేపటి వరకు పూర్తవుతాయన్నారు. సీఎం కేసీఆర్ సభాస్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కు లక్ష్మీ నియోజకవర్గమని, గతంలో 2014 ,2018 రెండుసార్లు హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. మూడోసారి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకమైన గాలరీలు ఏర్పాటు చేశామని, సభలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.

 

Related Posts

KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *