తెలంగాణలో నోట్ల కట్టలు..హవాలా దందా

హైదరాబాద్: అలా ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే..మరోపక్క నుంచి హవాలా దందా జోరు సాగుతుంది! ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఒక్క హైదరాబాద్‌లో 5 హవాలా కేసులు నమోదు అయ్యాయి… రూ. 4కోట్లకు పైగా నోట్ల కట్టలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది . దొరికిందే రూ.4 కోట్లు ఉంటే.. తప్పించుకున్నదెంతోనన్న అనుమానాలు కల్గుతున్నాయి

హైదరాబాద్‌లోనే.. పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముసద్దీలాల్‌ జువెలర్స్‌ ఎదుట నిర్వహించిన వాహన తనిఖీల్లో బెంజికారులో లెక్కతేలని రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న అంజుదేవి అనే మహిళను ప్రశ్నించగా.. ఆ డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలూ ఆమె చూపలేకపోయారు. పోలీసులు నగదును సీజ్‌ చేసి ఆమెను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు. అలాగే, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే చైతన్యపురి పీఎస్‌ పరిధిలో ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు వాహన తనిఖీలో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా అనుముల మండలం మీదుగా దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. హైదరాబాద్‌ నుంచి తాండూర్‌కు వెళ్తున్న ఒక కారును వికారాబాద్‌లో పోలీసులు ఆపి తనిఖీ చేసి.. రూ.9.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న మహమ్మద్‌ మోహిత్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్డులో సురేశ్‌ అనే వ్యక్తి ట్రాలీ ఆటోలో తరలిస్తున్న రూ.6.55 లక్షల నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకుంది. చేవెళ్ల మండలం అంతారం చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు చేసిన పోలీసులు.. తాండూర్‌కు చెందిన భానుచందర్‌ కారు డ్యాష్‌బోర్డులో దాచిన రూ.2.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

హవాలా జాకెట్లపై నిఘా

ఎన్నికల వేళ పోలీసుల చెకింగ్‌ భారీ స్థాయిలో ఉండడంతో.. హవాలా వ్యాపారులు డబ్బు సరఫరాకు కొత్తకొత్త చిట్కాలు వెతుకుతుంటారు. అలా గత ఎన్నికల్లో వారు ఎంచుకున్న కొత్త మార్గం.. హవాలా జాకెట్లు. బోలెడన్ని జేబులుండే ఆ జాకెట్‌లో రూ.కోటి వరకూ డబ్బులు దాచిపెట్టి తరలించారు. అప్పట్లో పోలీసులు ఛేదించిన రెండు కేసుల్లో వీటిని గుర్తించారు. అందుకని ఈసారి ఆ తరహా హవాలా జాకెట్లపై ప్రత్యేకంగా నిఘా వేస్తున్నారు.

అలా ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే..మరోపక్క నుంచి హవాలా దందా జోరు సాగుతుంది! ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఒక్క హైదరాబాద్‌లో 5 హవాలా కేసులు నమోదు అయ్యాయి… రూ. 4కోట్లకు పైగా నోట్ల కట్టలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది . దొరికిందే రూ.4 కోట్లు ఉంటే.. తప్పించుకున్నదెంతోనన్న అనుమానాలు కల్గుతున్నాయి

హైదరాబాద్‌లోనే.. పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముసద్దీలాల్‌ జువెలర్స్‌ ఎదుట నిర్వహించిన వాహన తనిఖీల్లో బెంజికారులో లెక్కతేలని రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న అంజుదేవి అనే మహిళను ప్రశ్నించగా.. ఆ డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలూ ఆమె చూపలేకపోయారు. పోలీసులు నగదును సీజ్‌ చేసి ఆమెను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు. అలాగే, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే చైతన్యపురి పీఎస్‌ పరిధిలో ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు వాహన తనిఖీలో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా అనుముల మండలం మీదుగా దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. హైదరాబాద్‌ నుంచి తాండూర్‌కు వెళ్తున్న ఒక కారును వికారాబాద్‌లో పోలీసులు ఆపి తనిఖీ చేసి.. రూ.9.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న మహమ్మద్‌ మోహిత్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్డులో సురేశ్‌ అనే వ్యక్తి ట్రాలీ ఆటోలో తరలిస్తున్న రూ.6.55 లక్షల నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకుంది. చేవెళ్ల మండలం అంతారం చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు చేసిన పోలీసులు.. తాండూర్‌కు చెందిన భానుచందర్‌ కారు డ్యాష్‌బోర్డులో దాచిన రూ.2.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

హవాలా జాకెట్లపై నిఘా

ఎన్నికల వేళ పోలీసుల చెకింగ్‌ భారీ స్థాయిలో ఉండడంతో.. హవాలా వ్యాపారులు డబ్బు సరఫరాకు కొత్తకొత్త చిట్కాలు వెతుకుతుంటారు. అలా గత ఎన్నికల్లో వారు ఎంచుకున్న కొత్త మార్గం.. హవాలా జాకెట్లు. బోలెడన్ని జేబులుండే ఆ జాకెట్‌లో రూ.కోటి వరకూ డబ్బులు దాచిపెట్టి తరలించారు. అప్పట్లో పోలీసులు ఛేదించిన రెండు కేసుల్లో వీటిని గుర్తించారు. అందుకని ఈసారి ఆ తరహా హవాలా జాకెట్లపై ప్రత్యేకంగా నిఘా వేస్తున్నారు.

Related Posts

INDvsENG 2nd T20: తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. భారత్‌ను గెలిపించిన తెలుగోడు

చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్‌(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు…

Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించింన కేంద్రం

గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day 2025) పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల(Padma Awards)ను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *