హైదరాబాద్: గిరిజన వర్శిటీ తెలంగాణా రాష్ర్టంలో ఏర్పాటు చెయ్యాలని 10ఏళ్లుగా మోదీ ప్రయత్నిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థలం ఇవ్వడం లేదని అమిత్షా ఆరోపించారు . తెలంగాణలో రజాకర్ల పోకడలు పోలేదని ఘాటగా విమర్శలు చేశారు. ఈనాటి రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు. రాష్ర్టానికి వారసుడిని సీఎం చెయ్యడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. 2014 నుంచి సీఎం అదే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలన్నారు షా. ఇంతకీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో తెలుసా అని అడిగి మరీ ఆయనో క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 3న తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే అన్నారు అమిత్ షా. ఆదిలాబాద్ సభలో ఆ ధీమా వ్యక్తం చేశారు.
* విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తాం:
భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడంతోనే ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచనా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. గిరిజనులకు మూడు ఎకరాల భూమితోపాటు రూ. 10 లక్షల దళిత బంధు హామీలు ఏమయ్యాయంటూ సీఎం కేసీఆర్ పై అమిత్షా విమర్శల వర్షం గుప్పించారు.