ఏపీ సచివాలయం(Secretariat)లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన షెడ్యూల్ మొత్తాన్నీ పక్కన పెట్టిన సచివాలయానికి వెళ్లారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. దీని వెనుక YCP నేతల కుట్ర ఉందని భావిస్తున్నట్టు కొందరు TDP నాయకులు CMకు తెలిపారు. అయితే.. ఆధారాలు లేకుండా చేసే విమర్శలు ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తుందని చంద్రబాబు వారితో అన్నారు. ఆధారాలు వచ్చే వరకు దీనిపై వేచి చూడాల్సిందేనని అన్నారు.
24గంటల్లో చెత్తను క్లియర్ చేయండి
ఇక అగ్నిప్రమాద సీఎం సీరియస్ అయ్యారు. అసలు సెక్రటేరియట్‌లో భద్రతా ప్రమాణాలు(Safety standards) పాటిస్తున్నారా? లేదా? అని అధికారులను నిలదీశారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. వెంటనే అన్ని చోట్లా CC కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తను క్లియర్ చేయాలని ఆదేశించారు.
ప్రమాదంపై దర్యాప్తు షురూ
కాగా ఈ తెల్లవారుజామున ఏపీ సచివాలయం(Secretariat)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది భనవంలోని 2వ బ్లాక్‌లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దీంతో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే బిల్డింగ్ లోని 2వ బ్లాక్‌లో పవర్ బ్యాక్ అప్(Power backup) కోసం బ్యాటరీలు స్టోర్ చేసే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది ఇప్పటికే దర్యాప్తును చేపట్టారు. కాగా ఈ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పాటు మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వంటి అనేక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి.
ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం
వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది #AndhraPradesh #FireAccident #APSecretariat pic.twitter.com/erFLgsnoQH
— Telugu Feed (@Telugufeedsite) April 4, 2025








