AP 10th Annual Exams: ఆల్ ది బెస్ట్.. నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

ఇంటర్ పరీక్షలు(Inter Exmas) ముగిశాయి. ఇక నేటి నుంచి ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షలు(10th Class Annual Exams) ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ నేటి నుంచి ఈనెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లో(examination centers)కి అనుమతిస్తామని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి పరీక్షా కేంద్రాలకు RTC బస్సుల్లో ఉచితంగా చేరుకోవచ్చునని ప్రకటించింది.

సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత

కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,49,884 మంది విద్యార్థులు(Students) పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 3,36,225 ఉండగా.. బాలికలు 3,13,659 మంది ఉన్నారు. ఇక మొత్తం 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 156 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయగా 163 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది. మొత్తం విద్యార్థుల్లో 51,069 మంది తెలుగు మీడియంలో పరీక్షలు రాయనున్నారు. ఒడియాలో 838 మంది, తమిళంలో 194 మంది, కన్నడలో 623 మంది, హిందీలో 16 మంది, ఉర్దూలో 2,471 మంది పరీక్షలు రాయనున్నారు. వీరితో పాటు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(Open School Society students) విద్యార్థులకూ సోమవారం నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మొబైల్‌ రహితంగా పరీక్షా కేంద్రాలు

టెన్త్ ఎగ్జామ్స్ నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాలను మొబైల్‌ రహితంగా ప్రకటించారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌కు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇతర ఎలక్ర్టానిక్‌ ఉపకరణాలైన ల్యాప్‌ట్యా‌ప్‌లు, కెమేరాలు, ట్యాబ్‌లు, ఇయర్‌ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ వంటివాటిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, ANMలను అందుబాటులో ఉంచారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *