APSRTC బస్సులో ‘తండేల్‌’ టెలికాస్ట్.. ఛైర్మన్‌ రియాక్షన్ ఇదే

టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తండేల్‌’ (Thandel). చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే చిత్రం విడుదలైన రోజు నుంచి దీన్ని పైరసీ భూతం వెంటాడుతోంది. ఇప్పటికే ఆన్ లైన్ లో ఈ సినిమా HDప్రింట్ వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను టెలికాస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వార్నింగ్

ఈ ఘటనపై ఈ సినిమా నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అర్వింద్ స్పందించారు. పైరసీ (Thandel Piracy)ని ప్రోత్సహిస్తోన్న వారిపై మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంస్థ ఛైర్మన్‌కు రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో  ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌  (APSRTC Chairman) కొనకళ్ల నారాయణరావు దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బస్సులో తండేల్ టెలికాస్ట్ దారుణం

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తండేల్ పైరసీ ప్రింట్‌ (Thandel HD Print In Bus) ప్రదర్శించడం దారుణం. ఈ సినిమా సక్సెస్ ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయింది. కొందరు తెలిసి, మరికొందరు తెలియక ఇలా సినిమాల్ని పైరసీ చేస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూప్స్‌లో ఆ లింక్స్‌ను ఫార్వర్డ్‌ చేస్తున్నారు.  పైరసీ చేస్తున్న వారిని, దాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతున్నాం. వాళ్లంతా జైలుకు వెళ్లే అవకాశముంది. యువతా జాగ్రత్త పైరసీ ప్రోత్సహించకండి. మీ భవిష్యత్తు పాడు చేసుకోకండి. అని నిర్మాతలు హెచ్చరించారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *