
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఛావా (chhava)’. ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.150+ కోట్ల వసూళ్లు సాధించింది.
తెలుగులోనూ ఛావా రిలీజ్
ఇక ఈ చిత్రం ప్రస్తుతం హిందీలోనే అందుబాటులో ఉంది. అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఛావా (chhava telugu version)’కు భారీ స్పందన వస్తోంది. అయితే ఈ చిత్రానికి వస్తున్న స్పందనను చూసి కొంతమంది హిందీ రాకపోయినా ఈ సినిమాను చూడాలనుకుంటున్నారు. అందుకోసమం ఈ మూవీని తెలుగు వెర్షన్ లోకి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది.
Huge Demand for #Chhaava to be released in Telugu. 💥💥💥 pic.twitter.com/g3TQtX14XN
— Nishit Shaw (@NishitShawHere) February 19, 2025
ఛావాకు భారీ రెస్పాన్స్
చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఛావా లాంటి సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఛావాను తెలుగు వెర్షన్ లో అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. టాలీవుడ్ మార్కెట్ లో ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగానే వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాలేవీ థియేటర్లలో లేకపోవడంతో ఛావాను రిలీజ్ చేస్తే వసూళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నాయి.