War 2 : ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ‘వార్-2’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బీ టౌన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి వస్తున్న ఈ మల్టీస్టారర్ కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా గురించి రైటర్ అబ్బాస్ ఓ సూపర్ అప్డేట్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయిందని ఆయన తెలిపారు.

వార్-2 రిలీజ్ డేట్ 

ఎన్టీఆర్ నటించిన తొలి హిందీ మూవీ వార్-2 (WAR-2) ఈ ఏడాది ఆగస్టులో విడుదలకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని అబ్బాస్ తెలిపారు. ఆరోజు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లను థియేటర్లో కలుద్దామని అన్నారు. వార్-2లో డైలాగ్స్ అన్నీ అబ్బాస్ (Abbas) రాశారు. ఈ డైలాగ్స్ అన్నీ ప్రేక్షకులను అలరిస్తాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

నెగిటివ్ రోల్ లో ఎన్టీఆర్

హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘వార్‌’. ఈ స్పై థ్రిల్లర్‌ సూపర్‌ సక్సెస్‌ సాధించడంతో అయాన్ ముఖర్జీ దీనికి సీక్వెల్ గా ‘వార్‌-2’ (War 2) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక వార్-2 సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ చిత్రం షూటింగ్‌లో భాగం కానున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *