
టాలీవుడ్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) రూటే సపరేటు. డైలాగ్ రైటర్ గా పేరు గాంచిన ఈ దర్శకుడు తన మాటలతో మెస్మరైజ్ చేస్తాడు. అందుకే ఇతగాడిని తెలుగు ప్రేక్షకులు మాటల మాంత్రికుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. తెరపై త్రివిక్రమ్ హీరో కనిపించాడంటే తన డైలాగుతో దిమ్మదిరిగే కిక్ ఇస్తాడని ఆడియెన్స్ లో నాటుకుపోయింది. అందుకే ఈ డైరెక్టర్ తో కలిసి ఒక్కసారైనా పని చేయాలని చాలా మంది హీరోలు అనుకుంటుంటారు.
సినిమాల్లోకి త్రివిక్రమ్ వారసుడు
ఇక స్టార్ హీరోల వారసులు సినిమాల్లోకి వస్తున్నట్టే పలువురు దర్శకుల వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి కూడా టాలీవుడ్ లో పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న రిషి (Rishi).. మొదట త్రివిక్రమ్ సొంత సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశాడు. ఇక కేవలం తండ్రి వద్దే కాకుండా ఫిల్మ్ మేకింగ్‌లో పూర్తి అవగాహన సంపాదించాలనే ఉద్దేశంతో ఇతర దర్శకుల వద్దా పని చేశాడు.
కింగ్ డమ్ సినిమాకు ఏడీగా
డైరెక్షన్ లో లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వాలనేది రిషి ఆలోచన. అందుకే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల వద్ద అతడు శిష్యరికం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ‘కింగ్ డమ్ (KINGDOM)’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక ఇప్పుడు మరో సెన్సేషనల్ దర్శకుడి వద్ద పని చేసేందుకు రెడీ అయ్యాడట. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ టీమ్ లో ఏడీగా చేరాలనుకుంటున్నాడట రిషి.
స్పిరిట్ టీమ్ లో రిషి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్ (Spirit)’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రిషి పని చేయాలనుకుంటున్నాడట. ఇక రిషి ప్రతిభ చూసిన సందీప్ తన డైరెక్షన్ టీమ్ లో అతడికి చోటిచ్చాడట. ఇలా ఇటు యంగ్ డైరెక్టర్లతో, అటు టాలెంటెడ్ దర్శకుల టీమ్స్ తో కలిసి రిషి డైరెక్షన్ నేర్చుకుని టాలీవుడ్ లో తండ్రికి మించిన దర్శకుడిగా మారాలని రిషి ప్రయత్నిస్తున్నాడట. ఇక పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ (Akira Nandan), త్రివిక్రమ్ తనయుడు రిషి కలిసి టాలీవుడ్ తెరపై ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లు అంటున్నారు.