రష్మిక కోసం గట్టిగా ట్రై చేస్తున్న నాని.. మరి ఓకే చెప్పేనా?

నేచురల్ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘ది ప్యారడైజ్ (The Paradise)’ అనే ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్వీ సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దసరాతో సూపర్ హిట్ అందుకున్న నాని, శ్రీకాంత్ (Srikanth Odela) కాంబో ఇప్పుడు మరో హిట్ కొట్టేందుకు ది ప్యారడైజ్ తో వచ్చేస్తోంది. ఇక యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

హీరోయిన్ కోసం వెతుకులాట

అయితే అంతా సెట్ అయిన ఈ సినిమాకు హీరోయిన్ మాత్రం దొరకడం లేదట. మొదట ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ భామ భారీగా రెమ్యునరేషన్ అడగడంతో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)ను సంప్రదించాలని భావించారట. కానీ హాయ్ నాన్న సినిమాలో నానితో మృణాల్ జంట కట్టిన విషయం తెలిసిందే. ఈ జంటకు భారీగా పాపులారిటీ కూడా వచ్చింది.

మృణాల్ ఔట్.. రష్మిక ఇన్

కానీ మళ్లీ నాని-మృణాల్  అంటే ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతారని మేకర్స్ భావించారట. ఈ నేపథ్యంలోనే మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారట. అందుకే ‘ది ప్యారడైజ్’ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna)ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇటీవల యానిమల్, పుష్ప-2 (Pushpa-2), చావా సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన రష్మిక ఇప్పుడు హీరోలకు లక్కీ గార్ల్ గా మారింది. అందుకే ఆమె అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.

రష్మిక డేట్స్ కుదిరేనా?

అందుకే హీరో నాని (Actor Nani) స్వయంగా రష్మిక మందన్న డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. కానీ ప్రస్తుతం రష్మిక ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లో అటు బాలీవుడ్ లో యమా బిజీగా ఉంది. కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, సికందర్ (Sikandar) వంటి సినిమాలతో క్యాల్షీట్లు ఖాళీ లేకుండా ఫుల్ ప్యాక్ అయిపోయింది నేషనల్ క్రష్ షెడ్యూల్. మరి ఇంత టైట్ షెడ్యూల్ లో ఆమె నాని సినిమాకు డేట్స్ ఇస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు చూడాల్సిందే. ఇప్పటికే నాని, రష్మిక కలిసి దేవదాస్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Pawan Kaiyan: భారీ ధరకు హరిహర వీరమల్లు ఓటీటీ డీల్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *