
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బింబిసార డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న సినిమా ‘విశ్వంభర (Vishwambhara)’. త్రిష, మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. చిరు సినిమాలో సాంగ్స్ అంటే తప్పకుండా డ్యాన్స్ నంబర్స్ ఉండాల్సిందే.
విశ్వంభరలో వీణ సాంగ్
చిరు డ్యాన్సును వెండితెరపై చూస్తుంటే వచ్చే మజాయే వేరు. ఆయన నటించిన ఇంద్ర సినిమాలోని దాయిదాయిదామా సాంగ్ లో వీణ స్టెప్పు (Veena Song) ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. ఇక మెగాస్టార్ మరోసారి వీణ స్టెప్పు వేస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు చాలా ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విశ్వంభర సినిమాలో వీణ సాంగ్ లాంటి పాట ఒకటి కంపోజ్ చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. వశిష్ట కథ పరంగా కాంప్రమైజ్ కాకుండానే మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ అంశాలు అన్నీ ఉండేలా చేస్తున్నట్లు సమాచారం.
మెగా ఫ్యాన్స్ కు వశిష్ట ఫీస్ట్
ఇక రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 (Khaidi No 150)తో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ ఆ తర్వాత వాల్తేరు వీరయ్యతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయినా మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే సక్సెస్ మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత గాడ్ ఫాదర్, ఆచార్య, భోళా శంకర్ ఇలా వరుస పరాజయాలతో మెగాస్టార్ సతమతమవుతున్నాడు. ఆయన కరీజ్మా తగ్గకపోయినా హిట్లు మాత్రం రావడం లేదని ఫీలవుతున్నారు. ఓ హిట్ కావాలని గట్టి ఆకలి మీదున్న మెగా ఫ్యాన్స్ కు వశిష్ట ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…