
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తాజాగా నటిస్తున్న సినిమా ‘అనగనగా ఒక రాజు (anaganaganaga oka raju)’. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి వాయిదా పడుతూనే వస్తోంది. మొదట అనౌన్స్ చేసి సినిమాను ఆపేసినట్లు వార్తలు వచ్చాయి. తిరిగి ప్రారంభించిన తర్వాత నవీన్ పొలిశెట్టికి రోడ్డు ప్రమాదం జరగడంతో మళ్లీ బ్రేక్ వచ్చింది. ఇక ఇటీవల ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ప్రీవెడ్డింగ్ వీడియోతో హైప్
కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌదరీ (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ప్రీ వెడ్డింగ్ వీడియో పేరుతో ఓ టీజర్ వచ్చింది. ఈ టీజర్ లో నవీన్ పొలిశెట్టి తనదైన మార్కు కామెడీతో అలరించారు. టీజర్ తోనే ఈ సినిమాపై ఆయన హైప్ క్రియేట్ చేశారు.
అనగనగా ఒక రాజు వస్తున్నాడు
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మేకర్స్ వేగంగా షూటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.