
సినీ నటుడు, YCP నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి బిగ్ రిలీఫ్ దక్కింది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై APలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుల్లో పోసానికి గుంటూరు కోర్టు(Guntur District Court) పోసానికి బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే పోసానికి తాజాగా CID కేసులో బెయిల్ రావడంతో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా? లేక మరోకేసులో అరెస్ట్ చేసి, రిమాండ్ కోరే అవకాశం ఉందా? అనే చర్చా అప్పుడే మొదలైంది. దీంతో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.
దాదాపు అన్ని కేసుల్లోనూ బెయిల్!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన TDP అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan), లోకేశ్(Lokesh)లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని, సినీరంగంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, వారి మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశం ప్రదర్శించారనే ఫిర్యాదులతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్‌లో పోసాని కృష్ణమురళిపై సుమారు 18 కేసులు నమోదయ్యాయి. అయితే దాదాపు అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించింది. అయితే కొన్ని కేసులో ఆయనకు 41A నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు(High Court) వెళ్లడించిన నేపథ్యంలో ఇకపై పోసాని బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.