నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సంక్రాంతికి బాలయ్యకు హిట్ తీసుకొచ్చి తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 56 కోట్లు రాబట్టింది.
రూ.150 కోట్ల ర్యాంపేజ్
డాకు మహారాజ్ తొలి వారం ముగిసే నాటికి రూ. 150 కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుక నిర్వహించేనుదుకు రంగం సిద్ధం చేసింది. అయితే రిలీజ్ కు ముందు ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తిరుమలలో తొక్కిసలాట జరగడంతో ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసింది.
22న డాకు సక్సెస్ పార్టీ
ఇక తాజాగా డాకు మాహారాజ్ సక్సెస్ పార్టీ (Daaku Maharraj Success Party) మాత్రం ఘనంగా అనంతపురంలో జరపాలని నిర్ణయించింది. ఈ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈ నెల 22వ తేదీన అనంతపురంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన క్రాకర్స్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొనబోతోంది.







