
కమర్షియల్ డైరెక్టర్‌గా పేరున్నా.. ఎక్కువ శాతం రీమేక్స్(Remakes)తో తన ప్రతిభను ఆ స్థాయిలో ప్రదర్శించే అవకాశం లేని డైరెక్టర్ హరీశ్ శంకర్(Director Harish Shankar). అద్భుతమైన కథలు చెప్పలేకపోయినా కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చేయడంలో ముందుంటాడు. కానీ ఇటీవల తన డైరెక్షన్‌లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్(Mr. Bachchan)’ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. హిందీలో వచ్చిన ‘రైడ్(RIDE)’ మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఇందులో హరీశ్ మార్క్ కానీ.. అటు రవితేజ(Ravi Teja) మేనరిజం కానీ కనిపించలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ మూవీలోని స్టెప్పులపై తెలంగాణ మహిళా కమిషన్(Telangana Women’s Commission) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
సడెన్‌గా బంపర్ ఆఫర్
అయితే ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత ప్రస్తుతం హరీశ్ శంకర్ ఏ మూవీ చేయడం లేదు. ఎందుకంటే తెలుగులో టాప్ హీరోలెవరూ ఆయనకు డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఆయన సడెన్‌గా ఓ బంపర్ ఆఫర్ పట్టేశాడనే టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం రామ్ పోతినేని(Ram Pothineni)తో సినిమా అనే న్యూస్ వచ్చింది. కానీ అది నిజం కాదు అన్నారు. అయితే ఈ సారి అంతకంటే పెద్ద స్టార్ తోనే సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఆ గ్యాప్‌లో బాలయ్య-హరీశ్ ప్రాజెక్ట్
తాజాగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)తో హరీశ్ శంకర్ సినిమా చేయబోతున్నాడని, ఈ మేరకు బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్లు సమాచారం. ఈ సినిమాను కర్ణాటక నుంచి హొంబలే ఫిల్మ్స్(Hombale Films) తరహాలో భారీ ప్రాజెక్ట్స్‌తో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోన్న KVN ప్రొడక్షన్స్ వాళ్లు నిర్మిస్తారు అంటున్నారు. ఈ కాంబో వర్కవుటైతే ఇది హరీశ్ శంకర్‌కు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం బాలయ్య Akhanda-2తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో సినిమా ఉంది. ఆపై బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యలో హరీశ్ ప్రాజెక్ట్ ఓకే కావొచ్చంటున్నారు.